23-1231 నిరాశలు

వర్తమానము: 63-0901E నిరాశలు

PDF

BranhamTabernacle.org

ప్రియమైన తండ్రి,

మేము చాలా కాలంగా ఆటలాడియున్నాము. చాలా కాలంగా మేము సంఘానికి వెళ్ళాము. గురుతు అను వర్తమానమును విన్నప్పటినుండి, అది నీ వధువును ఒక నిరాశలోనికి త్రోసివేసినది.

ఏదో జరగనైయున్నదని మేము ఎరిగియున్నాము. సమయము సమీపించినది. నీవు వచ్చి మమ్మల్ని ఈ లోకము నుండి తీసుకువెళ్ళవలసిందిగా మేము కోరుచున్నాము. మేము నీతో ఉండగోరుచున్నాము. మా ప్రాణాంతరంగములలో మేము తపించిపోతున్నాము.

మేము ఊరికే దాని గురించి మాట్లాడుకొనబోవుచున్నామా? మేము చాలినంతగా పరితపిస్తున్నామా? మేము రాత్రింబవళ్ళు చేయవలసినట్లుగా నీకు మొర్రపెట్టుచున్నామా?

ఓ, సంఘమా, లేచి మరియు నిన్ను నీవు జులిపించుకొనుము! నీ మనస్సాక్షికి గిచ్చుకొనుము, ఈ గడియలో, నిన్ను నీవు మేల్కొల్పుకొనుము! మనము పరితపిస్తూ ఉండాలి, లేదా నశించిపోతాము! ప్రభువు యొద్ద నుండి ఏదో వచ్చుచున్నది! అది యెహోవాఈలాగు సెలవిచ్చుచున్నాడుగా నాకు తెలియును. ఏదో వచ్చుచున్నది, మరియు మనము పరితపిస్తూ ఉండటం మంచిది. అది జీవమరణముల మధ్యన ఉన్నది. అది మనలను దాటి వెళ్తుంది మరియు మనము దానిని చూడకుందుము.

నిన్ను రంగము మీదకు తీసుకొనివచ్చుటకు ఆ తపన అవసరమైయున్నదని మేము ఎరిగియున్నాము. మేమిప్పుడే దానిని కలిగియుండాలి లేదా నశించిపోతామన్నట్లుగా ఉండవలసియున్నది. ప్రభువా, మునుపెన్నడూ లేనంతగా మమ్మల్ని పరితపించనిమ్ము, అప్పుడు నీవు రంగం మీదకు వచ్చి మరియు ఎదురుచూస్తున్న నీ వధువును తీసుకుంటావు.

తండ్రీ మేము దానిలోనికి చొచ్చుకొనిపోవులాగున సహాయము చేయుము. ఊరికే దానిలోనికి సులువుగా నడవటం కాదు గాని, దానిలోనికి చొచ్చుకొనిపోవునట్లు సహాయము చేయుము. కేవలం దాని గురించి మాట్లాడుచు మరియు మా అనుదిన జీవితాలతో కొనసాగడం కాదు. మేము మా హృదయమంతటితో, మా ప్రాణమంతటితో మరియు మా మనస్సంతటితో నిన్ను వెదకగోరుచున్నాము. ప్రభువా, మాకు సహాయము చేయుము.

ప్రభువా, మేము అనేకసార్లు నిన్ను విఫలపరిచాము, కాని మేము విఫలమైనా గాని, దానితో ఎటువంటి సంబంధము లేదని నీవు చెప్పావు; మేము ఆదినుండే విఫలమైనవారమే, అయితే నీవు అక్కడ నిలబడియుండి మరియు క్రిందకు చేరి మరియు బలమైన హస్తముతో మమ్మల్ని నీటి నుండి పైకి లేపుటకు మేము నిన్ను కలిగియున్నామని నీవు చెప్పావు.

గురుతు మాకు అనువర్తించబడియుండుటను నీవు చూసినప్పుడు మాత్రమే నీవు మమ్మల్ని దాటిపోవుదువని ప్రవక్త చెప్పియున్నాడు. ప్రభువా, మేము నీ సూచనలను పాటించి మరియు గురుతును అనువర్తించుకొని మరియు మా గృహములను టేపు సంఘముగా చేసుకొని, వాటిని వినుచూ మరియు ప్రతీ మాటను నమ్ముచున్నాము.

ఆయన ఆ—ఆ గురుతును మాత్రమే గుర్తిస్తాడు. అది ఈ గడియయొక్క వర్తమానమైయున్నది! అది ఈ దినపు వర్తమానమైయున్నది! అది ఈ కాలముయొక్క వర్తమానమైయున్నది! యేసు క్రీస్తు నామములో దానిని స్వీకరించండి!

మేము అనుకూలముగా ఉన్నాము, మరియు ప్రవక్త మాకు చెప్పినదాని ప్రకారంగా ప్రతిదానిని నమ్ముచు దానిని అనువర్తించుకొనుచున్నాము.

ప్రతీది నీ పరిపూర్ణమైన సమయములో జరుగుతు సంభవిస్తుందని మేము నమ్ముచున్నాము. అన్నియు వాటి స్థానములలో ఉన్నవి. మేము నీ అద్భుతాలన్నిటినీ చూశాము, మరియు వినియున్నాము మరియు గురుతు క్రిందకు వచ్చియున్నాము.

ఇప్పుడు మేము గురుతు క్రింద ఉండియుండగా, ఈ శనివారము ఒత్తిడితో మేము ప్రభురాత్రి భోజనమును తీసుకొనబోవుచున్నాము. ఏలయనగా తీర్పుతో నీవు తాకబోవుచున్నావని మేము ఎరిగియున్నాము.

అది ఎప్పుడైతే ఒక తొందరగల సమయములో, ఒక ఒత్తిడి సమయములో తీసుకొనబడినదో, అట్టి పస్కాకు చిహ్నంగా మేము దానిని తీసుకొందుము గాక. మరలా ఈనాడు మేము ఒత్తిడిలో ఉన్నాము తండ్రీ.

ప్రభువా, మేము ఈ సంవత్సరమును తిరిగి చూసి మరియు నీవు మా కొరకు చేసినవాటన్నిటినీ మేము చూడగలుగుచున్నందుకు కృతజ్ఞులమైయున్నాము. నీవు నీ వాక్యమును బయలుపరచి మరియు ముందెన్నడూ లేనంతగా ప్రత్యక్షతపై ప్రత్యక్షతను నీవు మాకు అనుగ్రహించియున్నావు.

మేము నీ కుమారులము మరియు కుమార్తెలమైయున్నామని మేము ఎరిగియున్నాము. మేము నీవు ఎంతో కాలంగా ఎదురుచూసినట్టి నీ పరిపూర్ణ వాక్యవధువైయున్నాము. మాలో జీవిస్తూ మరియు నివసిస్తున్నది, నీవేయైయున్నావు. నీవు మమ్మల్ని ఎన్నుకున్నావు, మమ్మల్ని ముందుగా నిర్ణయించుకున్నావు మరియు ఇప్పుడు నీవు మా కొరకు వచ్చుచున్నావు.

ప్రభువా, రాత్రింబగళ్ళు మేము నీకై కానిపెట్టుదుము గాక. మేము ఎంతో తపనతో నీకు మొర్రపెట్టుదుము గాక. ముందెన్నడూ లేనివిధంగా మేము దానిలోనికి చొచ్చుకొనిపోవుదుము గాక. ఈ సంవత్సరమే నీవు మా కొరకు వచ్చే సంవత్సరముగా ఉండును గాక. తండ్రీ, మేము నిన్ను ప్రేమిస్తున్నాము, మరియు నీ పరిపూర్ణ చిత్తములో ఉండగోరుచున్నాము. జఫర్సన్ విల్ కాలమానము ప్రకారంగా 5:00 P.M., గంటలప్పుడు మేము నీ స్వరము చుట్టూ కూడుకొనుచుండగా వచ్చి మాతో ఉండుము, మరియు మేము నిరాశలు 63-0901E లోనికి ఎట్లు వెళ్ళవలెనో నీవు చెప్పుటను మేము వినుచుండగా మాతో ఉండుము. పిదప మేము ఒత్తిడితో ప్రభురాత్రి భోజనములో పాల్గొనుచుండగా, మాతో ఉండుము.

ఇవి మా జీవితములలో అత్యంత గొప్ప దినములైయున్నవి తండ్రీ. ఏలయనగా నీతోపాటు మమ్మల్ని మా భవిష్యత్తు గృహమునకు తీసుకొనివెళ్ళుటకు నీవు త్వరగా వచ్చుచున్నావని మేము ఎరిగియున్నాము. మాకు ముందుగా వెళ్ళిన పరిశుద్ధుల కొరకు గొప్ప ఎదురుచూపుతో మేము అనుదినము ఎదురుచూస్తున్నాము. మేము వారిని చూసినప్పుడు, నీ రాకడ సమయము వచ్చియున్నదని మేము ఎరుగుదుము….మహిమ!!!

తండ్రీ, ఆ దినముకై మేము పరితపిస్తున్నాము.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్.

కూడికకు ముందు చదువవలసిన లేఖనములు:

నిర్గమకాండము 12:11
యిర్మియా 29:10-14
పరిశుద్ధ. లూకా 16:16
పరిశుద్ధ. యోహాను 14:23
గలతీ 5:6
పరిశుద్ధ. యాకోబు 5:16

రొట్టెను/ద్రాక్షరసమును తయారు చేయుటకు సూచనలు

ప్రభురాత్రి భోజనపు ద్రాక్షరసమును/పాద పరిచర్య పాత్రలను పొందుకోడానికి సూచనలు