10-1015 My Conversion

https://branham.org/en/articles/20101025_MyConversion

ప్రభువు తనకు ఏమి చేశాడో పంచుకోవాలనుకున్న ఒక యువ ఫిలిప్పీనో సహోదరుని నుండి మేము ఈ సాక్ష్యాన్ని అందుకున్నాము.

చిన్న వయస్సులో, సుమారు 5 సంవత్సరాల వయస్సులో, యెహోవాసాక్షులైన మా పొరుగువారు ఇచ్చిన పత్రికలను (ప్లెయిన్ ట్రూత్) మరియు పుస్తకాలను నేను చూశాను. నా తల్లిదండ్రులు రోమన్ కాథలిక్కులు కాబట్టి, నేను ఇంకా పసిబిడ్డగా ఉన్నప్పుడే బాప్తిస్మం తీసుకున్నాను. నేను ఆదివారాలలో మాస్ కు హాజరయ్యేవాడిని మరియు బుధవారాలలో ఇతర సందర్భాలైనా వర్ధంతి మొదలగునవి లేదా జపమాల మాసం (అక్టోబర్)లో జపమాల ప్రార్థన చేసేవాడిని.

నా ఉన్నత పాఠశాల రోజుల్లో, మేము రోమన్ కాథలిక్ చర్చికి చెందిన ఒక వసతి గృహంలో ఉండేవాళ్ళం కాబట్టి, ఆదివారం మరియు శుక్రవారాలలో మాస్ కు హాజరుకావడం తప్పనిసరి. ఆ రోజుల్లో మత ఉపాధ్యాయుల తనిఖీ కారణముచే మేము ప్రసంగాల సారాంశాన్ని తయారు చేయవలసి ఉండేది. బుధవారాలలో, వారు పిలిచే “పవిత్ర జపమాల”ను మేము చేయవలసి ఉండేది. కళాశాలలో కూడా నేను రోమన్ కాథలిక్ ఆచారాలు మరియు సంప్రదాయాలను పాటించాను. కళాశాల నుండి పట్టభద్రుడయ్యాక సంవత్సరాలు గడిచిపోయాయి. నేను ఫిలిప్పీన్స్‌లోని బగూయో నగరంలో మా అక్కతో కలిసి ఒక బోర్డింగ్ హౌస్‌లో నివసించేవాడిని. అప్పుడు పొడవాటి జుట్టు ఉన్న ఇద్దరు స్త్రీలు, సహోదరి ఎడిత్ వెలాస్కో మరియు సహోదరి ఫ్లోరెన్స్ డాలినో, నా దృష్టిని ఆకర్షించారు. వారు ప్రతి ఉదయం పాటలు పాడేవారు. ఆ తర్వాత వారు తిరిగి జన్మించిన క్రైస్తవులని నేను గ్రహించాను. నా కోసం వారికి ఒక ప్రణాళిక ఉందని తెలియకుండానే , నేను అప్పుడప్పుడు వారితో మాట్లాడేవాడిని.

నా 26వ పుట్టినరోజున, వారు నాకు కింగ్ జేమ్స్ బైబిల్‌ను బహుమతిగా ఇచ్చారు. వారు దానిని మా అక్క ద్వారా నాకు ఇచ్చినప్పటికినీ , నేను వారి తలుపు తట్టి, దానికి వారికి ధన్యవాదాలు తెలిపాను. వారు నాతో మొదటగా చెప్పిన విషయం ఏమిటంటే, మా ఇంటి దగ్గర అద్దెకు తీసుకున్న ఒక పాఠశాల గదిలో జరిగే ఆదివారపు ఆరాధనకు నన్ను ఆహ్వానించాలనుకుంటున్నామని తెలిపారు. నేను చాలాసార్లు హాజరయ్యాను, చివరికి వారు మనం ఏ కాలంలో జీవిస్తున్నామో నీకు తెలుసా అని అడిగారు, ఇంకా వారు యేసుక్రీస్తు రెండవ రాకడ, ఎత్తబడటం మరియు ధవలమైన మహా సింహాసనపు తీర్పు గురించి కూడా మాట్లాడారు. సహజంగానే, ఆ విషయాలన్నీ నాకు తెలియవని నేను సమాధానం చెప్పాను. వారు నాకు ప్రవక్త బ్రాన్హామ్ రాసిన కరపత్రాలు మరియు స్పోకెన్ వర్డ్ (పలుకబడిన మాట) పుస్తకాలను ఇచ్చారు. పాస్టర్ గారు బ్రదర్ బ్రాన్హామ్ గారి గురించిన తన వ్యక్తిగత ప్రతులను నాకు ఇచ్చారు:’ఏడు ముద్రలు ‘, ‘ఏడు సంఘ కాలముల యొక్క వివరణ ‘ మొదలైన పుస్తకాలు.

అప్పటి నుండి, నేను చదివే కొద్దీ, సంఘ సేఖలు , అంత్య క్రీస్తు , మృగం, ఆది పాపం మొదలైన వాటి గురించిన సత్యంపై నా కళ్ళు తెరుచుకుంటున్నాయి. అందుబాటులో స్పోకెన్ వర్డ్(పలుకబడిన మాట )పుస్తకాలు చాలా తక్కువగా ఉన్నందున, నేను నోట్స్ రాసుకుంటూ ఆ పుస్తకాలను చాలాసార్లు చదివాను. నా 26వ పుట్టినరోజు జరిగిన మూడు వారాల తర్వాత, నేను క్రీస్తును నా వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నాను. అప్పటి నుండి, నేను కేవలం యేసుక్రీస్తుపైనే నా నమ్మకాన్ని ఉంచి, ఆయన రెండవ రాకడ కొరకు ఎదురుచూస్తున్నాను.

ఐదు సంవత్సరాల క్రితం నేను కెనడాకు వచ్చినప్పుడు, పాస్టర్ గారు ఇచ్చిన పుస్తకాలతో సహా, క్రైస్తవ టేపులు మరియు నా స్పోకెన్ వర్డ్ పుస్తకాలన్నింటినీ నాతో పాటు తెచ్చుకున్నాను. ఇది క్రీస్తునందు మన సహోదర సహోదరీలతో నేను పంచుకోగల ఒక సజీవ సాక్ష్యం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు.

అర్మాండో

An Independent Church of the WORD,