
https://branham.org/en/articles/1132015_QuietTime
ప్రశాంత సమయం
ప్రశాంత సమయం ప్రతి శనివారం ఉదయం కేటాయించబడిన ఒక గంట సమయం. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ పనులన్నింటినీ పక్కనపెట్టి, మన రక్షకుడైన యేసుతో గడుపుతారు. ఇది జెఫర్సన్‌విల్ కాలమానం ప్రకారం ఉదయం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది బ్రెజిల్‌లోని సావో పాలోలో ఉదయం 10:00 గంటలకు, దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌లో మధ్యాహ్నం 2:00 గంటలకు, రష్యాలోని మాస్కోలో మధ్యాహ్నం 3:00 గంటలకు మరియు ఇండోనేషియాలోని జకార్తాలో సాయంత్రం 7:00 గంటలకు సమానం. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ ప్రత్యేక సమయాన్ని కలిగియుంటారు , మరియు ఈ ఒక్క గంట వారి జీవితములను ఎలా మారుస్తుందో తెలిపే సాక్ష్యాలను మేము నిరంతరం స్వీకరిస్తున్నాము.
ఏ తల్లితండ్రులు నైనా నవ్వించే ఒక సాక్ష్యం ఇక్కడ ఉంది.
మా ఎనిమిదేళ్ల కుమారుడు ప్రపంచ ప్రశాంత సమయంలో ఎప్పుడూ పాల్గొనలేదు, ఎందుకంటే మాకు అది ఉదయం 5:00 గంటలకు ఉంటుంది. అంత చిన్న వయస్సులో, శనివారం నాడు ఆ సమయమునకు అది కలిగియిండాలని దాని గురించి అతనికి సూచించాలని కూడా మేము ఎప్పుడూ అనుకోలేదు, కానీ స్పష్టంగా ప్రభువు అలా అనుకోలేదు.
నిన్న రాత్రి పొద్దుపోయాక, నోవా నిద్రపోవాల్సి ఉండగా, మాకు ఏదో చెప్పడానికి దొంగచాటుగా మంచం దిగి వచ్చాడు. నేను అతని మీద కోపగించుకోబోతుండగా, అతను, “రేపు ప్రశాంత సమయం కొరకు నాన్న నన్ను నిద్రలేపేలా చూస్తావా?” అని అన్నాడు. అతను అలా అడగగానే మా హృదయాలు ఉప్పొంగిపోయాయి అనడంలో సందేహం లేదు.
ఈ ఉదయం, నేను, నా భర్త నోవాను నిద్రలేపడానికి కిందకి పరుగెత్తుకుంటూ వెళ్లి, “ప్రశాంత సమయం కోసం ఇంకా లేవాలనుకుంటున్నావా?” అని గుసగుసగా అడిగాము. నోవా నిద్రమత్తులో ఉన్న కళ్ళు వెంటనే మెరిసాయి, అతను మంచం దిగి కిందకి దూకి సిద్ధమయ్యాడు. నోవా హృదయంలో ఆ కోరికను కేవలం ప్రభువే ఉంచాడని తెలిసికొని ,జరిగినదంతా చూడటం చాలా ప్రత్యేకంగా అనిపించింది.
ఈ ప్రత్యేకమైన క్షణాన్ని నేను నా ప్రశాంత సమయపు డైరీలో రాసుకున్నాను, మరియు ఆ పేజీలోని ఉళ్లేఖనమును , లేఖనాన్ని చదువుతున్నప్పుడు నా పెదవులపై చిరునవ్వేయున్నది . ఈ ఉళ్లేఖనమును, లేఖనాన్ని మా కుటుంబం మొత్తం కొరకని నేను ఖచ్చితంగా నమ్ముతాను మరియు స్వీకరిస్తున్నాను.
కానీ వీటన్నిటి మధ్యలో, ప్రతీ కాలములోను మరియు గతంలో వచ్చినట్టి లేదా భవిష్యత్తులో రాబోవునట్టి ప్రతీ ప్రవక్త ద్వారానూ, ఆ వర్తమానమును వినడానికి ముందుగా నిర్ణయించబడిన కొంతమంది ప్రజలు ఉంటారని, మరియు వారు దానిని వెంబడిస్తారని ఇప్పుడు వారు గ్రహిస్తారు. వారు గుంపులను లెక్కచేయరు. అది తప్పు లేదా అది దేవుడు ఏర్పాటుచేసిన మార్గము కాదు అని చెప్పే అవిశ్వాసియొక్క విమర్శను వారు లెక్కచేయరు. వారు వారితో ఎటువంటి వాదన పెట్టుకోరు. వారు తప్పకుండా చేయవలసిన ఒకే ఒక్కటి ఉన్నది, అదేమిటనగా నమ్మికయుంచి మరియు దానిలో వారు పొందుకోగల ప్రతిదానిని పొందుకోవడమైయున్నది, యేసు పాదముల దగ్గర కూర్చున్న మరియవలె అంతరంగములో పూర్తిగా దానితో నిండిపోవాలి.
65-0725E “ఆ పర్వతము మీద ఆకర్షణ ఏమిటి ?”
నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.
యోహాను 10:27
దేవుడు మిమ్మల్ని దీవించును గాక,
ఎంతో దీవించబడిన ఒక తల్లి
కెనడా