సేవల అనువాదాలు ప్రత్యక్ష ప్రసారం చేయబడినవి, మరియు ఆడియో డూప్లికేషన్, లిప్యంతరీకరణ లేదా ఏ విధంగానూ పునరుత్పత్తి కోసం ఉపయోగించబడవు. ప్రతి సేవ సమయంలో చెప్పబడిన వాటిని ఖచ్చితంగా ప్రసారం చేయాలనే ఉత్తమ ఉద్దేశాలను వ్యాఖ్యాతలు కలిగి ఉంటారు, కానీ ప్రత్యక్ష అనువాదాల సమయంలో మానవీయంగా తప్పించుకోలేని పదాలు మరియు తప్పులు ఉంటాయి. ఉపన్యాస అనువాదాలు స్వతంత్ర అనువాదాలుగా ఉద్దేశించబడలేదు మరియు వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగ్‌ల యొక్క సాధారణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండకపోవచ్చు.
అనువదించబడిన ఆడియో స్ట్రీమ్ వెనుక మా ఉద్దేశ్యం ఏమిటంటే, ఇంగ్లీష్ మాట్లాడని వారికి సేవల్లో మాతో కలిసి ఆరాధించే అవకాశాన్ని కల్పించడం. బ్రన్హామ్ టాబెర్నకిల్ అనేది మిషనరీ మనసున్న సంఘము. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిషన్ క్షేత్రలలో క్రీస్తు వధువు కోసం గొప్ప భారాన్ని కలిగి ఉంది. మా ప్రార్థనలు, ప్రేమ సమర్పణలు మరియు ఇప్పుడు, స్ట్రీమింగ్ ద్వారా వాక్యం చుట్టూ ఒక సహవాసము ద్వారా వారిని చేరుకోవడానికి ప్రభువు మాకు ఇచ్చిన అవకాశమునకు మేము కృతజ్ఞులం. ఈ సేవలు మీకు మరియు మీ కుటుంబానికి ఆశీర్వాదంగా ఉంటాయని మేము విశ్వసిస్తున్నాము.
-ఈ ప్రకటన బ్రన్హామ్ టాబెర్నకిల్ సహకారంతో రూపొందించబడింది.